ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కరోనా సమయంలో హీరోయిన్స్ అభిమానులకు సోషల్ మీడియా ద్వారానే టచ్లో ఉంటున్నారు. ఫాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తూ సమయాన్ని వెళ్లదీస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియా లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న తమిళ నటి ప్రియా భవాని శంకర్ ప్రేమలో పడిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించారు.
ఇటీవల అభిమానులతో మాట్లాడిన ఈ అమ్మడు ఈ విషయాన్ని బయట పెట్టింది. వివాహం గురించి ప్రశ్నించగా నేను ఒక ప్రత్యేక వ్యక్తిని ప్రేమిస్తున్నాను. కానీ నా దృష్టి ప్రస్తుతం కెరీర్ పై ఉంది. సమయం వచ్చినప్పుడు నా వ్యక్తిగత జీవితం గురించి మరిన్ని విషయాలు చెబుతాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు కమల్ హాసన్ ఇండియన్ 2 లో ముఖ్య పాత్ర పోషిస్తోంది.