సంతోష్ శోభన్ హీరో రాశీ సింగ్, రుచిత సాదినేని హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ప్రేమ్‌కుమార్’. శివ ప్రసాద్ పన్నీరు ఈ సినిమా నిర్మిస్తున్నారు. రైటర్ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లవ్ అండ్ ఎంటర్-టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అభిషేక్ మహర్షి మీడియాతో ముచ్చటించారు.
– చాలా సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా పని చేశాను. ఓటీ-టీ-లో షోలకి కూడా రాశాను. పేపర్ బాయ్ సమయంలో సంతోష్ శోభన్‌ను కలిశాను.. నా దగ్గర ఉన్న ముప్పై కథల్లోంచి ఓ కథను ఎంచుకున్నాం. చివరకు ప్రేమ్ కుమార్ కథ సెట్ అయింది.
– హను రాఘవపూడి, సుకుమార్, వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్, నగేష్ కుకునూర్ ఇలా అందరూ ఎంతో పర్ఫెక్ట్‌గా సినిమాను ప్లాన్ చేసి తీస్తారు. ఒక్కొక్కరిది ఒక్కో ్టసల్ ఉంటు-ంది. నేను నటు-డిగా వాళ్లతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఆ అనుభవాలన్నీ ఈ సినిమాకు ఉపయోగపడ్డాయి.
– సినిమాల్లో పెళ్లి సీన్‌లో చివర్లో హీరో వచ్చి.. హీరోయిన్ పెళ్లి ఆపుతాడు. హీరో హీరోయిన్లు కలిసిపోతారు. కానీ ఆ పెళ్లి కొడుకు గురించి ఎవ్వరూ ఆలోచించరు. వాడికి కూడా ఓ జీవితం ఉంటు-ంది. అది చెప్పేందుకే ఈ ప్రేమ్ కుమార్ సినిమాను తీశాం.
– స్క్రిప్ట్ లాక్ అయ్యాక అందులో ఎవ్వరూ ఏమీ వేలు పెట్టలేదు. సంతోష్ ఒక్కసారి సినిమా ఒప్పుకుంటే, డైరెక్టర్ ఏం చేయమంటే అదే చేస్తాడు.
– మ్యూజిక్ డైరెక్టర్ అనంత్ శ్రీకర్ నాకు తెలుసు. కామెడీ జానర్ ఆయనకు కొత్త. ఈ సినిమాకు ఫ్యూజన్ ్టసల్లో మ్యూజిక్ కొట్టాడు. ఆర్‌ఆర్ కూడా అద్భుతంగా వచ్చింది.
– కుచ్ కుచ్ హోతా హై, నువ్వే నువ్వే లాంటి సినిమాలు చూసి ప్రేరణ పొంది ఈ కథ రాశాను. మగాడికి పెళ్లి అయితే జీవితం నాశనం అవుతుంది. పీటల మీదే పెళ్లి ఎలా ఆగిపోతుందని చాలా రకాలుగా ఆలోచించి రాశాను.. బయట కూడా అలాంటి ఘటనలే జరిగాయి.
– సినిమాల మీద మా నిర్మాత శివ ప్రసాద్‌కి ఎంతో ప్యాషన్ ఉంది. సంతోష్, నేను, శివ ముగ్గరం కూడా ఎక్కడో ప్రారంభించి ఇక్కడి వరకు రావడమే సక్సెస్‌గా భావిస్తాం