Saturday, November 23, 2024

Movie | ప్రేమ్‌చంద్ ర‌చ‌న‌లు.. అంద‌రికీ అర్థమయ్యేలా ఉంటాయి: వివాన్ షా

ప్రేమ్ చంద్ రాసిన గుల్లీ దండా క‌థ ఆధారంగా తెర‌కెక్కిన కోయి బాత్ చ‌లే సిరీస్ చాలా బాగుంటుంద‌ని, ఆ సిరీస్‌లో తానొక భాగం కావడం సంతోషంగా ఉంద‌ని హిందీ న‌టుడు వివాన్ షా అన్నారు. తన తల్లిదండ్రులు నసీరుద్దీన్ షా, రత్న పాఠక్ షా ‘మోత్లీ ప్రొడక్షన్స్’ అనే నాటక బృందంతో గ‌డిపిన స‌మయం.. తాను ప‌డ్డ క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావనీ.. కానీ, త‌న అభిరుచిని గమనించి ఒక నాటకాన్ని ప్రదర్శించడానికి అవసరమైన క్రమశిక్షణ, కష్టాలు త‌న‌కే కొత్త కాదన్నారు. “ఇస్మత్ చుగ్తాయ్, మంటో.. వంటి అనేక కథలను ప్రదర్శించిన త‌న‌ తల్లిదండ్రుల కారణంగా.. భారతీయ సాహిత్యంలోని మాధుర్యం గురించి త‌న‌కు తెలిసింద‌న్నారు.

- Advertisement -

ఇక‌.. ర‌చ‌యిత ప్రేమ్ చంద్ అంటే త‌న‌కు వ్యక్తిగతంగా అభిమానం ఉంద‌ని, అతని కథ ‘గుల్లీ దండాస తాను చదివిన క‌థ‌ల‌లో అత్యంత బెస్ట్ అన్నారు. ఇక‌.. సున్నితమైన, కదిలించే కథలలో ఒకటిగా అది ఉంటుంద‌న్నారు. సీమా పహ్వా దర్శకత్వం వహించిన, జీ థియేటర్ వారి ‘కోయి బాత్ చలే’’లో తానొక భాగం కావడం చాలా ఆనందంగా, గౌరవంగా ఉంద‌ని, ఇది త‌న‌ అదృష్టంగా భావిస్తున్న‌ట్టు చెప్పారు. ప్రేమ్ చంద్ క‌థ‌ల‌లో మానవతావాదం ఉంటుందని, ఆ భాష‌ ఎవరికైనా అర్థమయ్యేలా ఉంటుంన్నారు. ఈ కథను ఇప్పుడు తెలుగులోకి అనువదించినందుకు సంతోషంగా ఉందన్నారు.

ఒక క్లాసిక్ కథను సరైన శృతిలో చెప్పడం, ఎక్కువ ప్రాప్స్ లేకుండా ఎక్కు పాత్రలు పోషించడం సవాలుతో కూడుకున్నదే అయినా.. ప్రత్యేకంగా ‘గుల్లీ దండా’ అనే కథలో ఆత్మను ఆవిష్కరించడాన్ని ఆస్వాదించానని వివాన్ అన్నారు. “ప్రేమ్‌చంద్ మనం విస్మరించే వర్గ విభేదాలను, సామాజిక అసమానతలను చాలా సున్నితంగా వెల్లడిస్తారు. దాన్ని బయటకు తీసుకురావడానికి, పాత్రలు, గద్యంలోని సూక్ష్మాంశాలకు న్యాయం చేయడానికి సీమ నాకు సహాయపడ్డారు.’’ అని వివాన్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement