Friday, October 4, 2024

Bharatiyadu 2 Pre-release | రేపే హైద‌రాబాద్‌కు సేనాప‌తి..

యూనివర్సల్‌ స్టార్‌ కమల్ హాసన్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘భారతీయుడు 2’. కాగా, ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ ప్లానింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈ క్రమంలో భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జూలై 7న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. జులై 7న సాయంత్రం 6 గంటల నుంచి ఎన్‌ కన్వెన్షన్‌లో భారతీయుడు 2 వేడుక జరగనుంది. ఇక ఇప్పటికే విడుద‌లైన పాట‌లు, ఇండియ‌న్ 2 ఇంట్రో గ్లింప్స్‌, ట్రైల‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి.

కమల్‌హాసన్‌, శంకర్‌ల కాంబోలో 28 ఏళ్ల క్రితం వచ్చిన ‘భారతీయడు’ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు మళ్లీ ‘భారతీయుడు 2’ తో వీరి కాంబో రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాను ఎప్పుడు చూస్తామా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ఈ తరుణంలో తెలుగు ప్రేక్షకులకు స్వాగతం పలికేందుకు నటీనటులు, సాంకేతిక నిపుణులు భాగ్యనగరంలో భారీ వేడుకను నిర్వహిస్తున్నారు. ఇక ఈ మూవీకి లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించగా, లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ భారీ బడ్జెట్‌తో భారతీయుడు 2 లో క్రియేటివ్ బ్రిలియెన్స్‌ను రూపొందిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement