యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అలాగే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ప్రశాంత్ 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఇక ప్రశాంత్ ప్రస్తుతం సలార్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటి కే జి ఎఫ్ 2 రిలీజ్ కి సిద్ధం గా ఉంది.