అందాల నటి ప్రణీత సుభాష్ పండంటి పాపకి జన్మనిచ్చింది. తమ జీవితంలోకి ముద్దుల పాపాయి అడుగుపెట్టిందని సోషల్ మీడియా ద్వారా ప్రణీత వెల్లడించింది. కొన్నిరోజులుగా నమ్మశక్యం కాని రీతిలో కాలం గడిచిపోయిందని, తన మాతృత్వపు సంతోషాన్ని సోషల్ మీడియా అభిమానులతో పంచుకుంది. ఈ మేరకు తన పేగుతెంచుకు పుట్టిన బిడ్డను చేతుల్లో పొదివిపట్టుకున్న ఫొటోను కూడా ట్వీట్ చేసింది. ప్రణీత గతేడాది మే నెలలోనే వివాహం చేసుకుంది. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుతో ఈ బ్యూటీకి పరిణయం జరిగింది. కాగా, పాప ఎంతో బాగుందని చాలామంది తమ అభిమానాన్ని చాటుకుంటూ సంతోషంగా కామెంట్స్ పెడుతున్నారు. ట్వీట్లు, రీ ట్వీట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.