Saturday, November 23, 2024

అచ్చు అమ్మ‌లాగే.. ప్ర‌గ‌తి కుమారై

క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు ప్ర‌గ‌తి గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈమెకి రెమ్యూనరేషన్‌ కూడా ఎక్కువే. ఒక్క రోజు కాల్షీట్ కోసం ప్రగతి దాదాపుగా 70 వేల వరకు డిమాండ్ చేస్తారట. అయితే పాత్ర నచ్చి.. ప్రొడక్షన్ హౌస్ చిన్నది అయితే.. డబ్బులు తక్కువ ఇచ్చినా అడ్జెస్ట్ అవుతారట. ఇక ఆర్టిస్ట్‌లు అందరితోనూ ఆమె ఇట్టే కలిసిపోతారు. అయితే పర్సనల్ లైఫ్‌లో చాలా ఒడిదొడుగులు ఎదుర్కొంది ప్రగతి. చిన్న వయసులో ఆమె పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లల తల్లి అయ్యారు. ఆ తర్వాత భర్త నుంచి విడాకులు తీసుకోవడంతో.. పిల్లల బాధ్యత ఆమెపై పడింది. అలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వారిని పెంచి పెద్ద చేసింది. సినిమాలో తన కుమార్తె పాత్రలు వేసే హీరోయిన్స్‌తో చక్కటి అనుబంధం ఏర్పరుచుకుంటుంది ప్రగతి. ఇక నిజ జీవితంలో కూడా కుమార్తె అంటే ఆమెకు ప్రాణం. తనను కుమార్తెగా పొందడం అదృష్టం అని ప్రగతి చెబుతుంటారు. ప్రజంట్ ప్రగతి కుమార్తె గీతకు 18 సంవత్సరాలు. తను కూడా తల్లిలాగే ఎంతో అందంగా ఉంది. ఆమె ఇండస్ట్రీవైపు ఇంట్రస్ట్ ఉందో, లేదో తెలియాల్సి ఉంది. ప్రజంట్ ప్రగతి కుమార్తె ఫోటో ఒకటి నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement