యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నాడు. అయితే ప్రభాస్ కి ముందు నుంచి ఓ అలవాటు ఉందట. షూటింగ్ సమయంలో సెట్ కి తన ఇంటి నుంచి భోజనాలను తీసుకొస్తూ ఉంటాడట. కొన్నిసార్లు స్వయంగా వండిమరీ తీసుకొస్తు ఉంటాడనేది ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్.
అయితే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాలో బాలీవుడ్ నటి భాగ్యశ్రీ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఆమెకు హైదరాబాద్ స్పెషల్ పూతరేకులు తినిపించాడట ప్రభాస్. కొన్ని స్వీట్ బాక్స్ లను ఆమె ఇంటికి పంపగా అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆమె ప్రభాస్ కి థాంక్స్ చెప్పింది. అంతే కాకుండా స్వీట్స్ తినిపించి తనని స్పాయిల్ చేస్తున్నావని సరదాగా కామెంట్ కూడా చేసింది.