Saturday, September 21, 2024

Prabhas | హ‌నుతో ప్రభాస్ కొత్త సినిమాకు క్లాప్..

ప్ర‌భాస్ జెట్ స్పీడ్ లో వ‌రుస పెట్టి కొత్త సినిమాల‌ను ప‌ట్టాలెక్కిస్తున్నాడు. క‌ల్కి సినిమా త‌రువాత ప్రస్తుతం మారుతి ‘రాజాసాబ్’ షూట్ లో బిజీగా ఉన్న డార్లింగ్… తాజాగా మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా నేడు పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమైంది.

కాగా, ఈ మూవీ ద్వారా ఇమాన్ ఇస్మాయిల్ టాలీవుడ్ కు పరిచయం అవుతొంది. ఓ పక్క డ్యాన్స్ నేర్చుకుంటూనే మరోపక్క చదువు పూర్తిచేసింది. ఆల్రెడీ ఇమాన్ సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో తన డ్యాన్స్ వీడియోలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. గతంలో ఇమాన్ డ్యాన్స్ వీడియోలు చాలా వైరల్ అయ్యాయి కూడా. ఇమాన్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. అలాంటి డ్యాన్సర్ ని ప్రభాస్ సరసన తీసుకోవడం విషేశం.

Advertisement

తాజా వార్తలు

Advertisement