Tuesday, October 22, 2024

Raja saab | స్టైలిష్ లుక్ లో ప్ర‌భాస్‌.. ‘రాజాసాబ్’ స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్ !

ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేష‌న్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ప్రభాస్ నటించిన పలు సినిమాలు రీరిలీజ్ చేయ‌గా… థియేటర్లలో అభిమానులు పండగ వాతావరణం సృష్టించారు. కాగా, తాజాగా డార్లింగ్ ప్రభాస్ అఫ్‌కమింగ్ మూవీస్‌లో ఒకటైన రాజాసాబ్ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి అభిమానులకు స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.

గళ్ళ చొక్కా, నల్ల ఫ్యాంటు, టీ షర్ట్ ధరించిన ప్రభాస్ లుక్ అదిరిపోయింది. ఈ పోస్ట‌ర్ అభిమానుల‌ను అల‌రిస్తోంది. ఇక ప్ర‌భాస్ బ‌ర్త్ డే రోజున టీజ‌ర్‌ను విడుదల చేయ‌నున్నారు. కాగా, మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న రాజా సాబ్ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు క‌థానాయిక‌లు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుద‌లైన‌ ఫస్ట్ లుక్, గ్లింప్స్ అభిమానులను ఆక‌ట్టుకున్నాయి. రొమాంటిక్ హారర్ కామెడీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement