Sunday, November 17, 2024

Pragathi: ప‌వ‌ర్ లిఫ్ట్ లో ప్ర‌గ‌తి కెవ్వు కేకే..

టాలీవుడ్ స్టార్ క్యారెక్టర్ న‌టి ప్రగతి గురించి తెలిసిందే. సినిమాల్లో అమ్మ, వదిన, అక్కగా ఎంత అద్భుతంగా నటిస్తుందో.. బయట అంత హాట్ గా ఉంటుంది. హాట్ హాట్ సోషల్ మీడియా వీడియోస్ తో సందడి చేస్తుంది. ఇక ఆమెనుంచి ఆడియన్స్ ఆశ్చర్యపోయేలా కనిపించేది ఫిట్నెస్.

ఆమె ఫిట్ నెస్ కు ఎంత ప్రియారిటీ ఇస్తారో మనకు తెలిసిందే. నిత్యం వర్కౌట్లతో జిమ్ లో ఆమె ఫొటోలు,వీడియోలు సోషల్ మీడియాలో రోజూ చూస్తూనే ఉంటాం. షూటింగ్ లు లేకపోతే జిమ్ లో ఎక్కువగా గడిపే ప్రగతి నేషనల్ లెవల్ లో తన సత్తా ఏంటో చూపించారు.

ప్రగతి తన సోషల్ మీడియా వీడియోస్ కోసం, ఫిట్ నెస్ ను మెయింటేన్ చేయడం కోసం.. ఏదో హోమ్ వర్కౌట్లు చేస్తుంది అనుకున్నారు. అంత వరకే మనకు తెలిసింది. అయితే, తాజాగా ఆమె సాధించిన గొప్ప విజయం చూసి.. అంతా నోరెళ్ళబెట్టారు. ఆమె సరదాకు చేస్తుంది అనుకున్న వెయిట్ లిఫ్టింగ్, జిమ్ చాలా సీరియస్ గా తీసుకుంది. అంతే కాదు పోటీలకు కూడా సై అంది. జాతీయ స్థాయికి వెళ్ళింది. నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం సాధించి వార్తల్లో నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement