Friday, October 18, 2024

Pooja Hegde | బుట్టబొమ్మ కాదు కుంభ‌క‌ర్ణ …

ముంబై బ్యూటీ పూజాహెగ్డే వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమ్మడు వెకేషన్ ఫోటోలు నెట్టింట షేర్ చేసింది. సోలోగా జంగిల్ రిసార్స్ట్ లో ఎంజాయ్ చేస్తోంది. అక్కడ ప్రతీ మూవ్మెంట్ ని అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా అమ్మడు మరో పిక్ రిలీజ్ చేసింది.

ఇందులో సొగసరి కడుపు నింపే కార్యక్రమంపై దృష్టి పెట్టింది. వెజ్-నాన్ వెజ్ అన్నిరకాల వంటకాల్ని కలిపి కుమ్మేస్తోంది. ఎదురుగా ఇష్టమైన వంటకాలన్నింటిని ముందుపెట్టుకుని ఆరగిస్తుంది. పెద్ద డైనింగ్ టేబుల్ పై ఆహార పదార్దాలను ఇక్కడ చూడొచ్చు.

వైట్ రైస్…పాపడ్, పీతల కర్రీ, రోటీ, వివిధ రకాల ప్రైలు అన్నింటిలోనూ కరివేపాకు దట్టించి మరీ ప్రిపేర్ చేయించుకుంది. అన్నింటిని రుచి వరకూ పరిమితం చేసింది. పూజాహెగ్డే ఇంతవరకూ ఎప్పుడూ ఇలా కనిపించలేదు. తొలిసారి ఓ పెద్ద ప్లేటులో భుజించడం ఇదే తొలిసారి కావచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement