Tuesday, September 17, 2024

Pooja Hegde | కొత్త‌గా… బుట్ట బొమ్మ…

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తెలుగులో చివరిగా ఆచార్య సినిమాలో కనిపించింది . ఆ తరువాత ఏదో ప్రమాదం కారణంగా కాళ్లకి దెబ్బ తగలడంతో కొంతకాలం విశ్రాంతి తీసుకుంది. అదే సమయంలో గుంటూరు కారం సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకుంది.

అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ ఆఫర్ కూడా పూజా హెగ్డే నుంచి శ్రీలీల చేతికి వెళ్ళిపోయింది. ఇలా వరుస దెబ్బల కారణంగా పూజా హెగ్డేకి అవకాశాలు కూడా తగ్గినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ అమ్మడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రాకున్న కూడా ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది.

ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే తనకి సంబందించిన ఇంటరెస్టింగ్ అప్డేట్స్ న కూడా ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. ఈ బ్యూటీకి 27.3 మిలియన్ ఫాలోవర్స్ ఇన్ స్టాగ్రామ్ లో ఉన్నారు. ఈ కారణం పూజా హెగ్డే ఇన్ స్టాగ్రామ్ లో ఎలాంటి ఫోటో పెట్టిన లక్షల్లో లైక్స్ వస్తాయి.

ఇక ఈ అమ్మడు గ్లామర్ పిక్స్ పంచుకుంటే వాటికి ఇంకా ఎక్కువ లైక్స్, కామెంట్స్ వస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ లాస్ ఏంజిల్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ బీచ్ లో ప్రకృతి అందాలని ఆశ్వాదిస్తూ చల్లగాలిలో విహరిస్తోంది. ఈ పిక్స్ ని పూజా హెగ్డే ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement