ఓటీటీలోకి వచ్చేసింది పొన్నియన్ సెల్వన్2. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చింది అమెజాన్ ప్రైమ్. ఈ సినిమాని ఓటీటీలో చూడాలంటే రెంట్ పే చేయాల్సిందే. ఈ సినిమాను ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్నా సరే అక్షరాల రూ.399 కట్టాల్సిందే. అయితే క్యాష్ బ్యాక్ రూపంలో రూ.100 వెనక్కు ఇచ్చే ఆఫర్‌ను కూడా పెట్టింది. అలా చూసుకున్నా ఈ సినిమా చూడాలంటే రూ.299 పెట్టాల్సిందే. పోని ఇంత ఖర్చు పెట్టి రెంట్‌కు తీసుకున్నా ఇందులోనూ మరో కిరికిరి ఉంది. అదేంటంటే షో మొదలు పెట్టిన నలభై ఎనిమిది గంటల్లోనే ఈ సినిమాను చూడాలి. ఆ తర్వాత లింక్ పనిచేయదు. ఇలా వందలకు వందలు పోగేసి ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోని.. మళ్లీ అందులో వందలు పెట్టి సినిమాలు చూడాలంటే అన్యాయం అని అంటున్నారు సినీ లవర్స్.పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను కల్కి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా మణిరత్నం తెరకెక్కించారు. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష వంటి స్టార్లు ఈ సినిమాలో నటించారు. ఏ.ఆర్ రెహమాన్ స్వరాలు అందించాడు. అమెజాన్ ప్రైమ్‌లో అన్ని భాషల్లో పొన్నియన్ సెల్వన్-2 సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement