Wednesday, December 18, 2024

Bigg Boss-8 Final | పోలీసుల ఆంక్షలు.. పూర్తి బాధ్యత నిర్వాహకులదే!

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 8 గ్రాండ్‌ ఫినాలే నేపథ్యంలో హైద‌రాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. గత సీజన్ విజేత పల్లవి ప్రశాంత్ అభిమానుల అత్యుత్సాహంతో గతేడాది పరిస్థితి అదుపు తప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి పోలీసులు ముందస్తుగా బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేశారు.

జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ పోలీసులు ఆంక్ష‌లు విధించారు. అన్నపూర్ణ స్టూడియో వ‌ద్దకు అభిమానులు పెద్దఎత్తున రానున్న నేపథ్యంలో భారీ బారికేడ్లను ఏర్పాటు చేసి.. దాదాపు 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టూడియో పరిసర ప్రాంతాల్లో ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్న బిగ్‌బాస్‌ నిర్వాహకులదే బాధ్యత అని పోలీసులు హెచ్చరించారు. కాగా, ఈ బందోబస్తు ఏర్పాట్లను వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్ కుమార్‌ పర్యవేక్షిస్తున్నారు. ఇక‌ ఇందిరానగర్‌, కృష్ణానగర్ నుంచి అన్నపూర్ణ స్టూడియోకు వాహన రాకపోకలపై నిషేదం విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement