స్టార్ సింగర్ లతా మంగేష్కర్ కి నివాళిగా ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో 40ఫీట్ల వీణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నగరంలో ఉన్న లతా మంగేష్కర్ చౌక్ వద్ద ఈ వీణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ నేడు ఈ వీణ విగ్రహాన్ని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి కిషణ్ రెడ్డి పాల్గొంటారు. నగరంలోని రామ్ కథా పార్క్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 1929లో లతా మంగేష్కర్ జన్మించారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఆరవ తేదీన ఆమె ముంబైలో మరణించారు. ఉత్తమ నేపథ్య గాయనిగా ఆమె మూడు సార్లు జాతీయ అవార్డు కూడా గెలిచారు. పరిచయ్, కోరా కాగజ్, లేకిన్ చిత్రాల పాటలకు అవార్డులు వచ్చాయి. యే మేరే వతన్‌కే లోగో లాంటి దేశభక్తి పాటను కూడా ఆమె ఆలపించారు.
లతా మంగేష్కర్ కి నివాళిగా-40ఫీట్ల వీణ విగ్రహం-ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ
Advertisement
తాజా వార్తలు
Advertisement