సింగర్ సునీత… ఎన్నో వందల పాటలు పాడిన గాయని. అయితే సునీత ఇటీవల బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారులోని శంషాబాద్ లో జరిగిన ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే తాజాగా భర్త రామ్ వీరపనేని తో సునీత ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే బీచ్ లో దిగిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాటితో పాటు భర్త రామ్ వీరపనేని బోట్ లో ప్రయాణించిన ఫోటోలను కూడా షేర్ చేశారు. అలాగే మరికొన్ని ఫోటోలను కూడా సునీత అభిమానులతో పంచుకున్నారు . ఇక ప్రస్తుతం ఈ ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న కల్లు గ్లాస్ తో దిగిన సునీత ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.