Tuesday, November 19, 2024

Payal : పాయ‌ల్ రాజ్ పుత్ కి బ్యాన్ త‌ప్ప‌దా..

ఆర్.ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ త‌న నిర్మాత‌ల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసారు. త‌న‌పై ప‌రుష ప‌ద‌జాలం ఉప‌యోగించ‌డ‌మే కాకుండా టాలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తామ‌ని త‌న సినిమా ర‌క్ష‌ణ‌ నిర్మాత‌లు బెదిరించిన‌ట్టు వెల్ల‌డించారు. తన పారితోషికానికి సంబంధించిన‌ బకాయిలను చెల్లించడంలో విఫలమైనందున వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా పాయ‌ల్ హెచ్చ‌రించింది.

సోషల్ మీడియాలో త‌న క‌ష్టాల‌ను ప్ర‌స్థావిస్తూ సుదీర్ఘ లేఖ‌ను షేర్ చేసింది. తాను సినిమాను ప్రమోట్ చేయకపోతే తెలుగు సినిమాల నుండి నిషేధిస్తానని ర‌క్ష‌ణ మేకర్స్ బెదిరించారని ఈ లేఖ‌లో స్ప‌ష్ఠంగా పేర్కొంది. ఇటీవల ఓ స‌మావేశంలో రక్షణ నిర్మాతలు త‌న‌పై అనుచితమైన భాషను ఉపయోగించారని, ఒక పంపిణీదారు త‌ప్పుడు విధానంలో మాట్లాడార‌ని సోష‌ల్ మీడియా నోట్ లో పాయల్ ఆరోపించింది.

- Advertisement -

ప్రమోషన్ల కోసం తన బృందం తమతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించిందని, అయితే వారు తనకు బకాయిలు చెల్లించేందుకు నిరాకరించారని పాయల్ పేర్కొంది. 2019 – 2020లో చిత్రీకరించిన‌ చిత్రం రక్షణ. ఈ సినిమా విడుదల ఆలస్యం అయింది. ఇప్పుడు వారు బకాయిలు చెల్లించకుండా ప్రమోషన్స్‌కి పిల‌వ‌కుండా సినిమాని రిలీజ్ చేస్తున్నారు. నా ఇటీవలి విజయం నుండి ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. నా బృందం ప్ర‌మోష‌న్స్ కోసం నా సౌల‌భ్యం గురించి తెలియజేసేందుకు సిద్ధంగా ఉంది. ముందస్తు కమిట్‌మెంట్‌ల కారణంగా నేను బిజీగా ఉన్నాను. కానీ వారు తెలుగు సినిమా నుంచి నన్ను బ్యాన్ చేస్తామని బెదిరించారు. A ”రక్షణ డిజిటల్ ప్రమోషన్ కోసం చర్చలు జరపడానికి మేం ప్రయత్నించాం. ముందుగా నష్టపరిహారంతో బకాయిలను క్లియర్ చేయమని సూచించాం. అయినప్పటికీ వారు రాజీకి నిరాకరించారు. నా ప్రతిష్టను దిగజార్చే విధంగా నా పేరును ఉపయోగించారు.. ఇది ఆమోదయోగ్యం కాదు!” అని పాయల్ ఆరోపించారు. తన బ‌కాయిల‌ను క్లియ‌ర్ చేయ‌కుండా, త‌న‌ అనుమతి లేకుండా సినిమాను విడుదల చేయాలనుకుంటున్నందున మేకర్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్లు ఈ నోట్ లో రాసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement