ముంబయిలో ఓజీ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేశారు దర్శకుడు సుజీత్. ఈ మేరకు ఓ అప్‌డేట్ ఇచ్చింది నిర్మాణ సంస్థ. ఓజీ` కోసం మార్గం చేయబడిందంటూ పేర్కొన్నారు. పవన్ ఎంట్రీ ఇచ్చిన లుక్‌ని పంచుకుంది. ఇది ట్రెండ్ అవుతుంది. అంతేకాదు త్వరలోనే అగ్నితుఫాన్‌లాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారట. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.ముంబయిలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్ కూడా వేశారు. ఇటీవల దీనికి సంబంధించిన టెస్ట్ షూట్ కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ సెట్‌లోకి అడుగుపెట్టాక ఎలాంటి అవాంతరాలు రాకుండా, టైమ్ వేస్ట్ కాకుండా ఆయనతో ఎంత మేరకు షూటింగ్ చేయోచ్చు, ఉన్న సమయంలో ఎంత ఎక్కువ సీన్లు తీయోచ్చు అనేదానిపై దర్శకుడు సుజీత్ అండ్ టీమ్ ఇటీవల టెస్ట్ షూట్ చేసింది. దీనికి ఏకంగా కోటి రూపాయలు అయ్యిందట. ఈ టెస్ట్ షూట్‌లో సుజీత్‌కి ఓ క్లారిటీ వచ్చినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో నేటి నుంచి ప్రారంభమయ్యే రెగ్యూలర్ షూట్‌ని ఫాస్ట్ గా చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమాని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారట. అందులో ఓ పార్ట్ ని ఈ ఏడాది విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మొదటి భాగం క్లైమాక్స్ గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉంటుందని, రెండో పార్ట్ పై ఆసక్తిని పెంచేలా చేస్తుందని తెలుస్తుంది. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా చాలా వరకు ముంబయిలో సాగుతుందని సమాచారం. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే కథ కావడంతో మాఫియా వంటి అంశాలకు ముంబయి కేరాఫ్‌గా నిలుస్తుంటుంది. అందుకే ఈ చిత్రానికి ముంబయి లొకేషన్ ఎంచుకున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్‌కి హీరోయిన్ ఉండదని, ఆయనపై పాటలు ఉండవని తెలుస్తుంది. కేవలం టాకీ పార్ట్ లోనే పవన్ కనిపిస్తారట. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా చేయబోతుందనే మరో వార్త వినిపించింది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా కోసం పవన్ 35-40డేస్ ఖాల్షీట్లు ఇచ్చారట.