జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాకేమన్నా థియేటర్లు ఉన్నాయా..? మీ వైసీపీ నేతలకే ఉన్నాయి. కాకినాడ, నెల్లూరుల్లో థియేటర్లు ఎవరివి మీ వారివి కావా..? సినిమా టిక్కెట్లు ఎంతైనా పెట్టుకోని చావండి.. నాకేం అభ్యంతరం లేదు. మా కష్టార్జితంపై మీ పెత్తనం ఏంటీ..? భారతీ సిమెంట్సును పంచండి. ఓ పని చేయండి.. ఇళ్లల్లోకి వచ్చి మా బంగారాన్ని లాగేసుకోండి. వైసీపీ వాళ్లు మాట్లాడ్డం ఎప్పుడు నేర్చుకుంటారు..? అరవడం తప్ప..’ అంటూ పవన్ వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇక ‘సినిమాలంటే నాకు ఇష్టం.. నాకు సినిమా అన్నం పెట్టిన తల్లి.. సినిమా పరిశ్రమను తక్కువ చేయడం లేదు.. కానీ, రాజకీయాల్లోకి నచ్చి వచ్చా.. నేను సినిమా హీరోను కాదు.. నేను నటుడిని కావాలని కూడా కోరుకోలేదు.. కానీ, సాటి మనిషికి అన్యాయం జరిగితే.. స్పందించే గుణం నాలో ఉంది.. మీకు యుద్ధం ఎలా కావాలో చెప్పండి.. ప్రజాస్వామ్య పద్ధతిలోనైనా సిద్ధం.. మరో విధంగా అయినా రెడీ.. మీరు తిట్టే కొద్దీ ఇంకా బలపడుతాను. సమస్యలని ప్రస్తావిస్తే.. మా ఆడపడుచుల గురించి మాట్లాడతారా..?. ఎవర్నీ మర్చిపోను, గుర్తుపెట్టుకొంటా’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతల సమావేశం