Friday, January 10, 2025

Pani | ఈనెల 16న సోనీ లైవ్ లో ‘పానీ’ !

హైద‌రాబాద్, (ఆంధ్ర‌ప్ర‌భ) : జోజు జార్జ్ తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం పానీ జనవరి 16న ప్రత్యేకంగా సోనీ లైవ్ లో ప్రసారం కానుంది. ఇది విధేయత, న్యాయం, సత్యాన్ని అన్వేషించే దిశగా సాగుతుంది. థియేటర్లలో విజయవంతమైన తర్వాత, పానీ ఇప్పుడు ఈనెల 16 నుండి ప్రత్యేకంగా సోనీ లైవ్ లో ప్రదర్శించబడుతుంది.

ఓటీటీలో విడుదల చేయడం గురించి జోజు జార్జ్ మాట్లాడుతూ… పానీ దాగి ఉన్న నిజాలను వెలికి తీయడానికి మించినదన్నారు. ఇది వాటిని బహిర్గతం చేయడానికి అయ్యే భారీ ఖర్చును అన్వేషించడం గురించి, ఇది కుటుంబం, విధేయత, న్యాయం, ప్రతీకారానికి సంబంధించిందన్నారు.

ఇక్కడ ప్రతి నిర్ణయానికి భారీగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ మాత్రమే కాదు, మానవ మనస్తత్వాన్ని లోతుగా ప్రతిబింబిస్తుందన్నారు. థియేటర్లలో ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన తర్వాత, పానీ ఇప్పుడు సోనీ లైవ్ ద్వారా మరింత విస్తృత ప్రేక్షకులను చేరుకుంటుందని, ఈ భావోద్వేగ ప్రయాణాన్ని ప్రతిచోటా ప్రేక్షకులకు అందిస్తుందని తాము సంతోషిస్తున్నామన్నారు.

దర్శకుడు, రచయిత, నటుడి పాత్రలను పోషిస్తున్న జోజు జార్జ్ తో పాటు, సాగర్ సూర్య, జునైజ్ వీపీ, బాబీ కురియన్, అభినయ, అభయ హిరణ్మయి, సీమా, చాందిని శ్రీధరన్, ప్రశాంత్ అలెగ్జాండర్, సుజిత్ శంకర్, రినోష్ జార్జ్ లతో సహా ఆకట్టుకునే సమిష్టి తారాగణం కీలక పాత్రల్లో నటించింది. ఈ చిత్రాన్ని ఏడీ స్టూడియోస్ పతాకంపై ఎం.రియాజ్ ఆడమ్, సిజో వడక్కన్ నిర్మించగా, వేణు ఐఎస్ సీ, జింటో జార్జ్ సినిమాటోగ్రఫీ అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement