Tuesday, November 19, 2024

గూఢచారి కథల్లో మన హీరోలు.. అన్నీ బ్లాక్ బస్టర్స్!

హాలీవుడ్‌ సినిమా జేమ్స్ బాండ్‌ సిరీస్‌ ప్రభా వం తెలుగు సినిమాలపై ఉంది. కాకీ డ్రస్సు తర్వా త హీరోలు ఇష్టపడేది జేమ్స్‌బాండ్‌ తరహా పాత్రలే అని చెప్పవచ్చు. జేమ్స్ బాండ్‌ తరహా పాత్రలను తెలుగులో చాలా మంది హీరోలు ధరించారు. అయితే దీనికి శ్రీకారం చుట్టింది మాత్రం సూపర్‌ కృష్ణ . కెరీర్‌ ప్రారంభంలో చేసిన ‘గూఢచారి 116’ ఆయన కెరీర్‌నే మలుపుతిప్పిం ది. ఆ తర్వాత అనేక మంది స్టార్స్‌ ఈ తరహా పాత్రలు చేశారు. చిరంజీవి సైతం డిటిక్టివ్‌ తరహా పాత్రలు చేశారు. ఆ తర్వాత యాక్షన్‌, ఫ్యాక్షన్‌ చిత్రాలు, కుటుంబ కథల తో అనేక సినిమాలు వచ్చాయి. ప్రతి పదేళ్ళ కు ఓ సారి ట్రెండ్‌ మారుతుంది అని అంటారు. మళ్లి గూఢచారి సీజన్‌ వచ్చేసిందని అంటున్నారు. నాలుగేళ్ల క్రితం ఈ జోనర్‌లో ‘గూఢచారి’ పేరుతో అడవి శేష్ హీరోగా వచ్చిన సినిమా భారీ విజయం సాధించింది. ఆ తర్వాత క్షణం అనే సినిమా కూడా వచ్చింది. ‘గూఢచారి’ చిత్రానికి సీక్వెల్‌ రాబోతోంది.

ఇక రెండేళ్ల క్రితం ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో నవీన్‌ పొలి శెట్టి కూడా బ్లాక్‌బస్టర్‌ అందుకున్నాడు. దాంతో మళ్లీ ఆ తరహా కథలకు డిమాండ్‌ పెరిగిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్పై కారెక్టర్స్‌ ఎక్కువై పోయారు. కమర్షియల్‌గా వర్కవుట్‌ అవుతుండటంతో చాలా మంది హీరోలు నటించేందుకు మొగ్గుచూపుతున్నారు.

ఇది మాత్రమే కాదు అంతకు ముందు చాలామంది హీరోలు ఇదే తరహాలో సీక్రెట్‌ ఏజెంట్‌ పాత్రలు చేసి మెప్పించారు. నటుడు కమల్‌ హాసన్‌ ‘విశ్వరూపం’ సినిమాలో సీక్రెట్‌ ఏజెంట్‌గా తన నటవిశ్వరూపం చూపించిన సంగతి తెలిసిందే. మరోవైపు మహేష్‌ బాబు ‘స్పైడర్‌’లో, బాలయ్య ‘పైసా వసూల్‌’లో, ఎన్టీఆర్‌ ‘శక్తి’ సినిమాల్లో ఇలాంటి తరహా సీక్రెట్‌ ఏజెంట్‌ పాత్రలే చేశారు. అటు సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కూడా ‘గరుడవేగ’ సినిమాలో సీక్రెట్‌ ఏజెంట్‌ తరహా పాత్రే చేశాడు. ఈ సినిమా బాక్స్‌ ఆఫీస్‌ దగ్గర మంచి విజయం సాధించింది. ఇవి మాత్రమే కాదు ప్రభాస్‌ ‘సాహొ’లో, విక్రమ్‌ ‘ధృవనక్షత్రం’లో, సూర్య ‘కప్పన్‌’లో ఇలాంటి తరహా సీక్రెట్‌ ఏజెంట్స్‌ పాత్రలే చేస్తున్నారు.

యువహీరోల్లో అక్కినేని అఖిల్‌ ‘ఏజెంట్‌’ అనే సినిమా చేస్తున్నారు. దీనికి సురేందర్‌ రెడ్డి దర్శ కుడు. ప్రవీణ్‌ సత్తారు సినిమాలో నాగార్జునతో పాటు కాజల్‌ కూడా స్పై తరహా పాత్రలోనే నటిస్తున్నారు. నవీన్‌ మేడారం దర్శకత్వంలో ‘డెవిల్‌’. ది బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ సినిమా చేస్తున్నాడు కళ్యాణ్‌ రామ్‌. ఇందులో ఆయన కూడా ఏజెంట్‌ పాత్రలోనే నటిస్తున్నాడు. త్వరలో రాబయే రాజశేఖర్‌ నటించిన శేఖర్‌ సినిమా కూడా నేర పరిశోధన నేపథ్యంలో రూపొందిన చిత్రమని తెలుస్తోంది. ఇవే కాకుండా మరికొంత మంది హీరోలు సైతం ఈ తరహా క్యారెక్టర్‌లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. గూఢచారి సినిమాలను యువత ఎక్కువగా ఇష్టపడుతుంది.. యాక్షన్‌ సినిమాగా గుర్తింపు ఉంటుంది.. కమర్షియల్‌గా మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఈ అనుకూల కారణాలు గూఢచారి సినిమాల నిర్మాణానికి కారణం అని సినీ వర్గాలు అంటున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement