- భారత్ నుంచి ఐదు చిత్రాలు
- రేసులో పాన్-ఇండియన్ డిజాస్టర్ మూవీ
97వ అకాడమీ అవార్డుల నామినేషన్లు విడుదలయ్యాయి. ఈసారి 323 సినిమాలు అకాడమీ అవార్డులకు అర్హత సాధించగా.. అందులో 207 సినిమాలు మాత్రమే అన్ని విభాగాల్లో పోటీకి అర్హత సాధించాయి. ఈ 207 సినిమాల్లో మన భారతీయ సినిమాలు 5 ఉన్నాయి. అయితే, పాన్-ఇండియన్ లెవల్లో బెడిసికొట్టిన డిజాస్టర్ చిత్రం కంగువా కూడా ఆస్కార్ రేసులోకి ప్రవేశించింది. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు..
ఆస్కార్‌కు అర్హత సాధించిన ఐదు భారతీయ చిత్రాలు ఇవే..
✦ కంగువా – (తమిళ్) :
► దర్శకుడు శివ – సూర్య కాంబినేషన్లో భారీ అంచనాల నడుమ దాదాపు 10 భాషల్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూసింది. అయితే, ఇందులో సబ్జెక్ట్, జంగిల్ బ్యాక్‌డ్రాప్, విజువల్ ఎఫెక్ట్స్ అకాడమీని ఆకర్షించాయి. దీంతో ఆస్కార్ నామినేషన్ లోకి ఈ సినిమాను చేర్చారు.
✦ ఆడుజీవితం – (హిందీ) :
► పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బ్లేస్సి దర్శకత్వంలో వచ్చి రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ని రాబట్టిన ‘ఆడుజీవితం’ (ది గోట్ లైఫ్) సినిమా ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్‌లో చోటును దక్కించుకుంది.
✦ సంతోష్ – (హిందీ చిత్రం) :
► సంధ్యా సూరి దర్శకత్వంలో షహానా గోస్వామి ప్రధాన పాత్రలో రూరల్ క్రైమ్ డ్రామాగా సంతోష్ చిత్రం తెరకెక్కింది. తన భర్త మరణంతో అతని కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పొందిన పాత్రలో షహానా గోస్వామి నటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా అడుగడుగునా ఉత్కంఠ రేపుతోంది.
✦ స్వాతంత్య్ర వీర సావర్కర్ – (హిందీ) :
► వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘స్వాతంత్య్ర వీర సావర్కర్. రణ్‌దీప్ హుడా ఈ సినిమాలో ప్రదాన ప్రాత్రలో నటించడమే కాకుండా, స్వీయ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సహ రచయితగా, సహ నిర్మాతగా కూడా రణ్‌దీప్ హుడా వ్యవహరించారు.
✦ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ – (మలయాళం-హిందీ) :
► పాయల్ కపాడియా రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమా 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో ఉత్తమ విదేశీ భాషా చిత్రం, ఉత్తమ దర్శకురాలు కేటగిరీలో రెండు నామినేషన్లను ఈ సినిమా అందుకుంది. ఫైనల్ రేసులో ఈ సినిమా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంటుందని అంతా భావిస్తున్నారు.
నామినేట్ అయిన సినిమాలకు రేపట (జనవరి 8) నుంచి 12 వరకు ఓటింగ్ జరుగుతుంది. జనవరి 17న తుది నామినేషన్‌లను ప్రకటిస్తారు. ఫైనల్ నామినేషన్‌లలో గెలుపొందిన చిత్రాలకు మార్చి 2న జరిగే ఆస్కార్ 2025 అవార్డుల వేడుకలో అవార్డులను అందజేస్తారు.