థియేటర్ లో రికార్డులు బద్దలుకొట్టిన కన్నడ సినిమా కాంతార.. చివరికి గురువారం (నవంబర్ 24న) ఒటీటీలో అడుగుపెట్టింది.. ఈ మూవీలోని వరాహరూపం పాట కాపీ కొట్టారని ‘తైక్కుడంబ్రిడ్జ్’ బ్యాండ్ కోర్టుకెక్కింది. దీంతో ఈ విషయం కాస్త వివాదాస్పదమైంది. ఈ అంశంపై తైక్కుడంబ్రిడ్జ్ బ్యాండ్ కోర్టుకు వెళ్లడంతో వారికి అనుకూలమైన తీర్పే వచ్చింది.. OTT ప్లాట్‌ఫాం కూడా నిర్ణయాన్ని అనుసరించింది. ఇక అమెజాన్ లో రన్ అవుతున్న ఈ సినిమాలో ఉండే వరాహరూపం అనే సాంగ్ ను కట్ చేసిన వర్షన్ ఒటీటీలో రిలీజ్ చేసింది అమెజాన్.
అయితే.. ఇప్పుడు కాంతార సినిమాకు కేరళ హైకోర్టు నుంచి ఉపశమనం లభించింది. హైకోర్టు ఆదేశాలతో ఒరిజనల్ వర్షన్ ను ఓటీటీ చేర్చుతున్నారు. వరాహరూపం పాట సినిమాలోని క్లైమాక్స్ ఎలివేట్ చేసింది. ఇక ఇప్పడు ఒటీటీలో ఒరిజినల్ వెర్షన్ అప్‌లోడ్ అయినట్టు తెలుస్తోంది.. OTT వీక్షకులు అత్యంత ప్రభావవంతమైన పాటతో ఒరిజినల్ మూవీని ఎంజాయి చేయచ్చు. కోర్టు తీర్పుపై సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంతారా మూవీ మాస్ మసాలా అంశాలతో కూడిన జానపద థ్రిల్లర్గా పేరు తెచ్చుకుని దేశ వ్యాప్తంగా ఇప్పటికే 400 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది.