రిలీజ్ అయ్యి కనీసం నెల రోజులు కూడా పూర్తి కాకుండానే ఓటీటీలో వచ్చేస్తోంది విశ్వక్ సేన్ ఓరి దేవుడా మూవీ. తాజాగా వెంకటేష్-విశ్వక్ సేన్ లు కలిసి నటించిన ఓరి దేవుడా మూవీ మూడు వారాల లోపే ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. అశ్వద్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుని వసూళ్లపరంగా పర్వాలేదు అని పించింది. అక్టోబర్ 21న విడుదలైన ఈ మూవీ.. ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో ఇవ్వాల అర్థ రాత్రి నుండి ఓరి దేవుడా స్ట్రీమ్ కానుంది. 30 రోజులు గడవకుండానే ఓటీటీలోకి వచ్చేసింది.
ఈ మేరకు ఆహా అధికారిక ప్రకటన చేసింది. విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో వెంకటేష్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్ర ఓటీటీ హక్కులు దక్కించుకున్న ఆహా నవంబర్ 11 నుండి అందుబాటులోకి తేనుంది.