ఇటీవల కాలంలో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పటి క్లాసిక్, బ్యాక్ బస్టర్ సినిమాలను మళ్లీ థియేటర్లలో చూస్తూ.. రీ-రిలీజ్ సందర్భంగా పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ అభిమానులు ఎంజాయి చేస్తున్నారు.
తాజాగా రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా మరోసారి రీ-రిలీజ్ కు సిద్ధమైంది. రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా 2023లో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయగా అద్భుతమైన సందన వచ్చింది. ఇక తాజాగా ఈ చిత్రాన్ని మరోసారి రీ రిలీజ్ చేయనున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరీ 14న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.