కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీఖాన్ సీనియర్ హీరోయిన్ త్రిష పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యాలు చేసిన వివాదం మరింత ముదిరింది.. ఈ విషయంలో తాను అన్న వ్యాఖ్యాలకు కట్టుబడి ఉన్నానని మన్సూర్ అలీఖాన్ తేల్చి చెప్పాడు. త్రిష గురించి తాను తప్పుగా మాట్లాడలేదని, అందుకే క్షమాపణ కోరబోనని తేల్చిచెప్పారు. త్రిషకు క్షమాపణ చెప్పని కారణంగా నడిగర్ సంఘం తనపై నిషేధం విధించడంపై మాట్లాడుతూ నడిగర్ సంఘం తప్పు చేసిందని వ్యాఖ్యానించారు.
వివరణ అడగకుండా, విచారణ జరపకుండా చర్యలు తీసుకున్నారని అన్నారు. సినిమాల్లో హత్య చేస్తే నిజంగానే చేసినట్లు కాదని, సినిమాల్లో రేప్ చేస్తే నిజంగానే చేసినట్లా? అని ప్రశ్నించారు. తనకు వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్మెంట్ను వెనక్కి తీసుకునేందుకు నడిగర్ సంఘానికి 4 గంటలు సమయమిస్తున్నానని డెడ్లైన్ విధించారు. తనకు తమిళనాడు ప్రజల మద్దతు ఉందని, తాను క్షమాపణ చెప్పే వ్యక్తిలా కనిపిస్తున్నానా? అని ప్రశ్నించారు. తాను నోరు విప్పితే అనేకమంది విషయాలు బజారున పడతాయని హెచ్చరించారు.
వివాదం ఏంటి?
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు మన్సూర్ అలీఖాన్ త్రిష పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను ఎన్నో రేప్ సీన్లలో నటించానని, ‘లియో’ సినిమాలో ఛాన్స్ రావడంతో త్రిషతో కూడా అలాంటి సీన్ ఉంటుందని భావించానని, కానీ సీన్ లేకపోవడంతో బాధగా అనిపించిందని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలే దుమారాన్ని రేపాయి. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వాఖ్యాలను ,అలీ తీరును మెగాస్టార్ చిరంజీవి సైతం ఖండించారు.. దక్షిణాది తారలు త్రిషకు మద్దతు ప్రకటించారు.