రామాయణం ఆధారంగా ఎన్ని ధారావాహికలు, సినిమాలు వచ్చినప్పటికీ ఆ పేరు చెప్పగానే ప్రేక్షకులకు గుర్తొచ్చేది మాత్రం రామానంద్ సాగర్ తెరకెక్కించిన ‘రామాయణ్’ సీరియలే. రికార్డు స్థాయిలో వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఆ సీరియల్ ఇప్పుడు మరోసారి అలరించేందుకు సిద్ధమైంది.
ఈవిషయాన్ని దూరదర్శన్ తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘రాముడు మరోసారి మీ ముందుకు వస్తున్నాడు. దేశవ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ‘రామాయణ్’ త్వరలోనే దూరదర్శన్‌లో ప్రసారం కానుంది’ అని పేర్కొంది. ఇందులో రాముడిగా అరుణ్ గోవిల్ – సీతగా దీపికా చిక్లియా నటించారు. లక్ష్మణుడి పాత్రలో సునీల్ లహ్రీ తన నటనతో అందరినీ ఆకర్షించారు. ‘రామాయణ్’ సీరియల్ రీ టెలికాస్ట్ అవడం ఇది రెండోసారి. తొలిసారి 1987 జనవరి 25 నుంచి 1988 జులై 31 వరకు ప్రతి ఆదివారం ఉదయం 9:30 గం.లకు దూరదర్శన్‌లో ఈ సీరియల్ ప్రసారమైంది. ఆ తర్వాత కొవిడ్ సమయంలో 020లో మార్చి 28 నుంచి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో దీన్ని ప్రసారం చేశారు. తాజాగా మరోసారి ఈ సీరియల్ ప్రసారం కానుంది.