Saturday, November 23, 2024

వివాహ బంధానికి ఏడాది…వైఫ్ తో నితిన్

జయం సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు నితిన్. ఆ తర్వాత వరుస సినిమాలు ఫ్లాప్ అయినా కూడా నిలబడ్డాడు. ఇష్క్ సినిమాతో మళ్లీ సక్సెస్ బాట పట్టి వరుస సినిమాలను చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం నితిన్ మాస్ట్రో సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇదిలా ఉండగా నితిన్ గత ఏడాది కరోనా సమయంలో శాలినిని వివాహం చేసుకున్నారు. అతి తక్కువ మంది బంధువులు సన్నిహితుల మధ్య ఈ వివాహం జరిగింది. అయితే వీరి పెళ్లి బంధానికి ఏడాది పూర్తయింది.

ఈ సందర్భంగా నితిన్ సోషల్ మీడియా ద్వారా తన భార్యకు శుభాకాంక్షలు చెబుతూ… తన తో కలిసి దిగిన ఫోటో షేర్ చేశారు. ఒకరికి వార్షికోత్సవ శుభాకాంక్షలు. వారితో నేను నా జీవితాంతం గడపాలని కోరుకుంటున్నాను. నా జీవితాన్ని సులభతరం చేసినందుకు అద్భుతంగా మార్చినందుకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు నితిన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement