ఎట్టకేలకు తన తల్లి కోరికను తీర్చాడు జూనియర్ ఎన్టీఆర్. తన కొడుకు ఎన్టీఆర్‌ను తన స్వగ్రామం తీసుకుని వెళ్లాలని, ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకోవాలన్న ఆమె కోరికు ఎన్టీఆర్ తీర్చేశాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అమ్మ పుట్టిన రోజుకి రెండు రోజుల ముందు ఇలా చేయడం తనకు తాను ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకున్నారు ఎన్టీఆర్.
‘నన్ను తన స్వగ్రామం కుందాపురానికి తీసుకొచ్చి ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలనే మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరింది! సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజుకు ముందు జరిగేలా చేయడం నేను ఆమెకు ఇవ్వగలిగిన ఉత్తమ బహుమతి.’ అని ఎన్టీఆర్ రాసుకొచ్చారు.