Tuesday, November 26, 2024

Rashmika: మౌనంవహించడం కాదు ప్ర‌శ్నించాలి

‘యానిమల్‌’ సినిమాకు సక్సెస్‌ టాక్‌ రావడంతో నేషనల్‌ క్రష్‌ అనే పేరును మరోసారి సార్ధకం చేసుకుంది రష్మిక. తెలుగు, తమిళ చిత్రాల నటిగా పేరు తెచ్చుకుంది. టాలీవుడ్‌లో టాప్‌హీరోయిన్లలో ఒకరిగా తన స్థానాన్ని నిలుపుకుంది. పుష్ప సినిమాతో అభినయంలో తన సత్తా చాటింది.

‘గుడ్‌బై’, ‘మిషన్‌ మజ్ను’ చిత్రాలతో బాలీవుడ్‌లో పాతుకుపోవాలని ప్రయత్నించిన రష్మిక ఇప్పుడు యనిమల్‌ హిట్‌తో కమర్షియల్‌ హీరోయిన్‌గా బాలీవుడ్‌ నాయికలకు పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. కొద్ది నెలల వ్యవధిలో నయనతార (జవాన్‌) ఇప్పుడు రష్మిక బాలీవుడ్‌లో పాగా వేసినట్టే అని పరిశీలకులు భావిస్తు న్నారు. ఇటీ వలే డీప్‌ ఫేక్‌ వల్ల ఇబ్బంది పడిన రష్మికకు సినీ ప్రముఖులు మద్దతుగా నిలిచారు. దీని గురించి ఒక సమావేశంలో ఆమె స్పం దించింది. ”డీప్‌ ఫేక్‌ వల్ల సెలబ్రిటీలకే కాదు వేలాది మంది స్త్రీలకు ఇబ్బందికరంగా మారిందని అన్నారు. మనలో ఉన్న బాధ అందరికీ తెలిసినప్పుడు మనకు భరోసా దక్కుతుంది. కొంతరి కారణంగా మన క్యారెక్టర్‌ ప్రశ్నార్థకంగా మారిన సందర్భంలో మౌనం వహించడం కాదు ప్రశ్నించాలి. వాటిని ప్రతిఘటించాలి. అప్పుడే ప్రపంచం మనకు మద్దతుగా నిలుస్తుంది” అని పేర్కొంది. యానిమల్‌ సక్సెస్‌తో రష్మిక ఉత్తరాదిలో క్రేజ్‌ ఏర్పడిం దని, ఈ సినిమాకు 4 సుమారు కోట్ల పారి తోషికం అందుకు న్న ఆమె ఇప్పుడు ఎక్కువ డిమాండ్‌ చేస్తోందని సమాచారం కాదు ప్రశ్నించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement