ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ సినిమాలకు విరామం చెప్పాడు. తన కుమార్తె రాహాతో గడిపేందుకు ఆరు నెలల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని రణబీర్ కపూర్ నిర్ణయించుకున్నాడు. జూమ్ ద్వారా రణబీర్ తన అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగానే ఈ విషయాన్ని వెల్లడించాడు. యానిమల్ సినిమా తర్వాత తాను ఏ సినిమాకు కమిట్ మెంట్ ఇవ్వలేదన్నాడు. రణబీర్ కపూర్, అలియా భట్ 2022 ఏప్రిల్ లో వివాహం చేసుకోగా, వీరికి అదే ఏడాది నవంబర్ 6న సంతానం కలిగింది. వచ్చే నెలలోనే రాహా మొదటి పుట్టిన రోజు జరుపుకోనుంది. సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నందున తన కుమార్తెతో ఇప్పటి వరకు పెద్దగా సమయం గడపలేకపోయినట్టు రణబీర్ వెల్లడించాడు. అందుకే ఇప్పుడు 5-6 నెలల పాటు సినిమా షూటింగ్ లకు దూరంగా ఉండి, కుమార్తెతో సమయం వెచ్చించాలని నిర్ణయించుకున్నట్టు రణబీర్ కపూర్ తెలిపాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement