Thursday, November 21, 2024

Niharika Konidela : అందాల హ‌రివిల్లు…

మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నా కూడా సొంతగా తనకంటూ గుర్తింపును తెచ్చుకునే విధంగా నిహారిక కొణిదెల అడుగులు వేస్తోంది, సోషల్ మీడియాలో తన నూతన లుక్స్ తో ఎప్పటికప్పుడు అభిమానులను ఆకట్టుకున్నారు. ప్రముఖ మెగా హీరోల కుటుంబం నుండి వచ్చిన నిహారిక, తన సొంత శైలితో మెప్పించడానికి కృషి చేస్తోంది. ఇటీవల తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత, నిహారిక తన కెరీర్ పై దృష్టి పెట్టి కొత్త ప్రాజెక్టులకు సైన్ చేస్తున్నారు.

- Advertisement -

ప్రస్తుతం నిహారిక కోలీవుడ్, టాలీవుడ్ లో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. తమిళంలో ‘మద్రాస్ కరన్’ మరియు తెలుగులో ‘వాట్ ది ఫిష్’ అనే చిత్రాల్లో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లు షూటింగ్ వేగంగా జరుగుతున్నాయి. కేవలం సినిమాల్లోనే కాకుండా, నిహారిక ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాం పై ‘చెఫ్ మంత్ర’ సీజన్ 3కి హోస్ట్ గా వ్యవహరిస్తూ, ప్రేక్షకులను అలరిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారిక, తన ఫ్యాన్స్ తో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ, తాజా ఫోటోషూట్స్, ప్రాజెక్ట్ అప్డేట్స్ ను పంచుకుంటున్నారు. తాజా గా స్టైలిష్ గ్లామరస్ డ్రెస్ లో ఉన్న నిహారిక ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. బ్లూ కలర్ లోనే తన గ్లామర్ తో హరివిల్లుని గుర్తు చేసింది. ఈ కొత్త ఫోటో, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో లుక్స్ ఆకట్టుకుంటూ, తన స్టిల్ తో కుర్రకారును మంత్రముగ్ధులను చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement