Thursday, November 28, 2024

Niharika : నిహారిక రూటు మార్చింది… 

మెగా ఫ్యామిలీలో రెబల్ కిడ్ గా ఉంది నిహారిక. ఆ ఫ్యామిలీ నుండి హీరోయిన్ అయిన ఒకే ఒక అమ్మాయి. విడాకుల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నిహారిక మెగా ఫ్యామిలీని భయపెడుతుంది. ఇతర హీరోయిన్స్ మాదిరే కమర్షియల్ హీరోయిన్ గా ఎదగాలి అనేది ఆమె కోరిక. అందుకే నిహారిక తరచుగా ఫోటో షూట్స్ చేస్తున్నారు.

- Advertisement -

నిజానికి నిహారిక హీరోయిన్ కావడం మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదనే వాదన ఉంది. నిహారిక పంతం నెగ్గించుకుని హీరోయిన్ అయ్యింది. అయితే గ్లామరస్ రోల్స్, బోల్డ్ సీన్స్ కి దూరంగా ఆమె ఉన్నారు. ఆమె నటించిన ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం.. ఆడలేదు. చెప్పాలంటే మెగా హీరోలు పెద్దగా ప్రోత్సహించలేదు. ప్రమోట్ చేయలేదు.

హీరోయిన్ గా సక్సెస్ కాకపోతే పెళ్లి చేసుకోవాలని నాగబాబు కండిషన్ పెట్టారట. దాని ప్రకారం 2020లో నిహారిక వివాహం చేసుకుంది. కానీ ఆమె మనసు మాత్రం నటన మీదే ఉంది. విడాకుల అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది నిహారిక. నిర్మాతగా, నటిగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలాగే చెఫ్ మంత్ర పేరుతో ఆహాలో ఒక షో చేస్తుంది. ఓటీటీ కావడంతో గెస్ట్స్ ని డబుల్ మీనింగ్ ప్రశ్నలు అడుగుతుంది నిహారిక. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మెగా ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.

మెగా ఫ్యామిలీ ఇమేజ్ ని నిహారిక దెబ్బ తీస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఇంస్టాగ్రామ్ లో ఆమె చేసే గ్లామరస్ ఫోటో షూట్స్ ని వ్యతిరేకించే వర్గం ఉంది. మెగా ఫ్యామిలీ అమ్మాయి అంటే మా అమ్మాయినే… మీరు ఇలా చేయవద్దని నిహారికకు సలహాలు ఇస్తున్నారు. నిహారిక మాత్రం ఒక గ్లామరస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తుంది. నిహారికను ప్రోమోట్ చేసి ఆమె స్టార్ అయ్యేలా మెగా ఫ్యామిలీ చేయలేదు. అదే సమయంలో ఆమె గ్లామరస్ ఫోటో షూట్స్ చేయకుండా ఆపలేరనే వాదన మొదలైంది. ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక అమ్మాయి నచ్చిన కెరీర్లో ముందుకు వెళితే తప్పేంటని నిహారికకు మద్దతు తెలిపేవారు కూడా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement