తనకంటే పది సంవత్సరాలు చిన్నవాడయిన అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ ని లవ్ చేసి పెళ్లి చేసుకుంది గ్లోబల్ స్టార్ ప్రియాంకచోప్రా. కాగా తాను మిస్ వరల్డ్ కిరీటం గెలుపొందినప్పుడు నిక్ జోనస్‌కు ఏడేళ్లని, ఇలా చెప్పడం కాస్త వింతలా ఉందని ఆమె తెలిపింది గ్లోబల్ స్టార్ ప్రియాంకచోప్రా. తాను పదిహేడేళ్ల వయసులో మిస్ వరల్డ్ కిరీటం అందుకున్నానన్నారు. లండన్ వేదికగా జరిగిన ఆ పోటీల్లో పాల్గొన్నాను. అప్పుడు నేను చిన్న పిల్లనే అని ప్రియాంక వివరించారు. 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలను మా మావయ్య, అత్తయ్య టీవీలో చూశారట. నేను టైటిల్ గెలుపొందిన క్షణాలు తనకింకా గుర్తేనని అత్తయ్య నాతో చెప్పారు. అప్పుడు నిక్ వయసు ఏడేళ్లట. ఇంట్లో వాళ్లతోపాటు తను కూడా టీవీ ముందు కూర్చొని నన్ను చూశాడట. తలచుకుంటే వింతగా ఉందని గుర్తు చేసుకున్నారు. కాలం మా ఇద్దర్నీ కలిపింది. మేము కలవాలని రాసిపెట్టి ఉంది. వయసుపరంగా మా ఇద్దరి మధ్య ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ మేం ప్రేమించుకున్నాం. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం అని ప్రియాంకా చోప్రా తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement