Saturday, November 23, 2024

త్వరలో ఛార్మి పెళ్లి ?

ఛార్మి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి సరిగ్గా 19 ఏళ్లు అవుతోంది. ఒకానొక సమయంలో తెలుగు స్టార్ హీరోలతో నటించిన ఛార్మి ప్రస్తుతం అవకాశాలు లేక నిర్మాతగా మారింది. మొత్తం 50సినిమాలకు పైనే నటించింది. ప్రస్తుతానికి పూరి జగన్నాథ్ తో కలిసి ఛార్మి సినిమాలు నిర్మిస్తోంది. అయితే ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఛార్మి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందట. టాలీవుడ్ హీరోయిన్ ఒక్కొక్కరు ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఛార్మి కూడా పెళ్లి చేసుకునేందుకు నిర్ణయం తీసుకుందట. అయితే గతంలో తనకు పెళ్లి పై నమ్మకం లేదని తనకెలాంటి తోడు అవసరం లేదని చెప్పుకొచ్చింది. మరి ఈ పెళ్లి వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారికంగా ఎవరో ఒకరు స్పందించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement