హీరోయిన్స్ వయసు పెరుగుతున్న కొద్దీ పెళ్లి టాపిక్ తెరపైకి తీసుకొస్తుంటారు నెటిజన్లు. అయితే గతంలో స్టార్ హీరోయిన్ త్రిష పెళ్లి గురించి రకరకాల వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి త్రిష పెళ్లికి సంబంధించి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో త్రిష ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ మణియన్ ను ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల మధ్యలోనే వారి బంధం తెగిపోయింది.
ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత పెళ్లి విషయంలో ఎక్కడా ప్రస్తావన తీసుకురాలేదు. ఇప్పుడు ఎట్టకేలకు మళ్లీ త్రిష పెళ్లికి సంబంధించి వార్తలు బయటకు వస్తున్నాయి. మరి ఈసారైనా త్రిష పెళ్లి విషయం చెబుతుందో లేదో చూడాలి.ప్రస్తుతం త్రిషకి 38 ఏళ్లు.