‘వాల్ పోస్టర్’ సినిమా సక్సెస్ పొంది ప్రశంసలు కూడా అందుకుంది. దీనికి నటుడు నాని సమర్పిస్తూ, సహకారం అందిస్తున్నారు. తాజాగా ప్రియదర్శి ప్రధాన పాత్రలో రామ్ జగదీష్ దర్శకుడిగా పరిచయ మవుతున్న చిత్రాన్ని ప్రకటించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ అనే టైటిల్ పెట్టారు.
అన్యాయంగా ఓ కేసులో ఇరికించిన ఓ కుర్రాడి కోసం జరిగే న్యాయ పోరాటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో ప్రియదర్శి లాయర్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రియదర్శిపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్ కొట్టగా, నిర్మాత ప్రశాంతి కెమెరా స్విచాన్ చేశారు.
సెప్టెంబర్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రంలో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు.