Thursday, September 19, 2024

#COURT | నానీ నిర్మాణంలో కొత్త సినిమా..

‘వాల్‌ పోస్టర్‌’ సినిమా సక్సెస్‌ పొంది ప్రశంసలు కూడా అందుకుంది. దీనికి నటుడు నాని సమర్పిస్తూ, సహకారం అందిస్తున్నారు. తాజాగా ప్రియదర్శి ప్రధాన పాత్రలో రామ్‌ జగదీష్‌ దర్శకుడిగా పరిచయ మవుతున్న చిత్రాన్ని ప్రకటించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కోర్ట్‌ – స్టేట్‌ వర్సెస్‌ ఎ నోబడీ’ అనే టైటిల్‌ పెట్టారు.

అన్యాయంగా ఓ కేసులో ఇరికించిన ఓ కుర్రాడి కోసం జరిగే న్యాయ పోరాటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో ప్రియదర్శి లాయర్‌ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రియదర్శిపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్‌ కొట్టగా, నిర్మాత ప్రశాంతి కెమెరా స్విచాన్‌ చేశారు.

సెప్టెంబర్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. ఈ చిత్రంలో శివాజీ, సాయి కుమార్‌, రోహిణి, హర్షవర్ధన్‌, హర్ష్‌ రోషన్‌, శ్రీదేవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. దినేష్‌ పురుషోత్తమన్‌ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement