మామూలుగా సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ లు మంచి రిలేషన్ ఫిప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. బయట కూడా అలానే అప్పుడప్పుడు తిరుగుతూ కనిపిస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇంతకి అంత ప్రచారం ఎక్కువ అవుతూ వస్తోంది. కాగా టాలీవుడ్ లో బడా ఫ్యామిలీకి చెందిన హీరో వరుస ఫ్లాపులతో ఉన్న మరో హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.
ఇద్దరూ కూడా చెట్టాపట్టాలేసుకొని ఆఫ్ స్క్రీన్ లో కూడా తిరుగుతున్నారట. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఓ మంచి లవ్ స్టోరీ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో వారి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడానికి కారణం కూడా ఈ ఆప్ స్క్రీన్ వ్యవహారం అని నెటిజన్లు సైతం మాట్లాడుకుంటున్నారు. అంతేకాక ఇటీవలే పుట్టినరోజు జరుపుకున్న ఆ యంగ్ హీరో ఇంటికి ఓ స్పెషల్ కేక్ ని పంపించిందట ఈ అమ్మడు. అయితే ఫ్యామిలీ మెంబర్స్ సైతం ఆ కేక్ ను చూసి షాక్ అయ్యారట. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో వారికే తెలియాలి.