దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు లక్షల్లో కేసు నమోదు అవుతున్నాయి. అలాగే వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా నివారణకు వివిధ రాష్ట్రాలలో లాక్ డౌన్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. తమిళనాడులో ఏకంగా కరోనా దేవికి గుడి కూడా కట్టించి పూజలు చేస్తున్నారు. కాగా ఆ కరోనా దేవి విగ్రహం తమిళ నటి వనిత విజయ్ కుమార్ ని పోలి ఉండటం ప్రస్తుతం వివాదాలకు దారితీస్తోంది.
కరోనా దేవి విగ్రహం పక్కన వనిత విజయ్ కుమార్ ఫోటోలు పెట్టి కరోనా దేవి ఈమె అంటూ సోషల్ మీడియాలో ఆ ఫొటోలను వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఇదే విషయమై నటి వనిత విజయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా తన ఫోటోను కరోనా దేవి ఫోటోతో కలిపి ఎడిట్ చేసిన ఈ పోస్ట్ ను షేర్ చేసింది. ఓరి దేవుడా ఏంటి ప్రతి ఒక్కరు ఈ ఫోటో తో పాటు మీమ్స్ పంపుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం.