Monday, November 18, 2024

ఆర్థిక సహాయం చేయకపోతే ఆత్మహత్య…. రేణుకు నెటీజన్ మెసేజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య సినీ నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక కరోనా కష్ట సమయంలో పేద ప్రజలకు సహాయం చేస్తున్నారు రేణుదేశాయ్. అలాగే తనకి అనవసరంగా హాయ్ హలో అంటూ మెసేజ్లు పెట్టొద్దు అని అలాంటి మెసేజ్ లు పెట్టడం వల్ల సహాయం కోసం మెసేజ్ చేసే వారి మెసేజ్ లు చదవలేక పోతున్నానని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా తాజాగా రేణుదేశాయ్ మరో సారి నెటిజన్స్ పై ఫైర్ అయ్యారు. ఆర్థిక సహాయం చేయాలంటూ తనకు మెసేజ్ లు వస్తున్నాయని.. కానీ తాను ఆర్థిక సహాయం చేయలేనని మెడిసిన్స్, ఫుడ్ సహాయం చేయగలనని చెప్పుకొచ్చారు. అలా కాకుండా ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేస్తూ… చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తు కూడా మెసేజ్ లు చేస్తున్నారని అలా చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇచ్చారు రేణు.

Advertisement

తాజా వార్తలు

Advertisement