ఎప్పుడో చిరుత మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ నేహాశర్మ.. రామ్ చరణ్ మాత్రం గ్లోబల్ స్టార్ గా మారారు. అయితే ఇప్పటి వరకు ఆమె స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. తన పేరు కన్న మొదటి సినిమా క్రేజ్ తోనే పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ నేహా శర్మ.. తాజాగా ఆమె నటించిన బాలీవుడ్ సినిమా జోగిరా సారా రారా . రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమా మే 12న థియేటర్లలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. దాంతో ఈమూవీ ప్రమోషనర్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు టీమ్. ఈసినిమాలో హీరోగా బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్ధి నటించగా.. ఆయనతో కలిసి ప్రమోషన్స్ చేస్తోంది ఈ బ్యూటీ.
ఈక్రమంలో వీరిద్దిరి మధ్య స్నేహం ప్రేమగా మారినట్టు బాలీవుడ్ కోడై కూస్తోంది. ఈ క్రమంలోనే వాళ్ళిద్దరి మధ్య ఉన్న సన్నిహిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. నవాజ్ –నేహా కలిసి తిరగడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమాకి ప్రమోషన్స్ చేస్తున్న నేహా.. నవాజ్ ప్రేమలో పడ్డారు అంటూ కూడా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .
వీరిద్దరు కలిసి తిరుగుతుండటం.. వీరి ప్రవర్తలో మార్పు కనిపిస్తుండటంతో.. డైరెక్టుగా వీరిపై పెళ్లి పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. నవాజుద్దీన్ కి ఇప్పటికే పెళ్లయిన సంగతి తెలిసిందే.