Tuesday, September 17, 2024

NBK 109 | త్వ‌ర‌లోనే టైటిల్ టీజ‌ర్..

బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఓ మూవీలో నటిస్తున్నారు. NBK109 అనే వర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి సాలిడ్ అప్ డేట్ ఇచ్చాడు దర్శకుడు బాబీ. ఈ సినిమాలోని ఓ కీలక సన్నివేశం చిత్రీకరణ ఇటీవల జైపూర్‌లో జరిగిందని తెలిపారు. ఇక‌ త్వరలోనే ఈ సినిమా టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. శ్రీకరా స్టూడియోస్‌పై సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ బ్యానర్లపై నాగవంశీ, సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement