Monday, November 18, 2024

నయనతార – బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంట‌రీ రివ్యూ

  • సినిమాల్లోకి రావాలని అనుకోలేదన్న నయనతార
  • డిగ్రీలో ఉండగా ఫస్టు ఛాన్స్ వచ్చిందని వెల్లడి
  • తన రిలేషన్ గురించిన ప్రచారాలపై ఆవేదన
  • మెచ్యూరిటీ లేక అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నానని వివరణ
  • ‘శ్రీ రామరాజ్యం ఆఖ‌రి సినిమా అనుకున్నా..
  • కాని తన పరుగు కొనసాగించాన‌ని వెల్ల‌డి
  • విఘ్నేష్ తో ప్రేమ పెళ్లి…ప్ర‌స్తావ‌న‌
  • సీనిరంగంలో ప‌రుగు ఆపితే ఆ ప్లేస్ ఇక ఎప్ప‌టికీ ద‌క్క‌డు

తెలుగు.. తమిళ.. మలయాళ భాషల్లో నయనతార స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. నయనతార జీవితంలో ఇంతవరకూ జరిగిన సంఘటనలపై ‘నయనతార – బియాండ్ ది ఫెయిరీ టేల్’ పేరుతో ఒక డాక్యుమెంటరీ రూపొందింది. ఆమె 40వ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ రోజు నుంచి ఈ డాక్యుమెంటరీ ‘నెట్ ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ డాక్యుమెంట‌రీలో నయనతార మాట్లాడుతూ.. “నా బాల్యం చాలా సాదాసీదాగా సాగిపోయింది. నాన్న ఉద్యోగరీత్యా అనేక ప్రదేశాలను తిరగడం జరిగింది. అమ్మానాన్నల వ్యక్తిత్వం ప్రభావం నాపై ఉంది” అని ఆమె చెప్పారు. నేను సినిమాలు ఎక్కువగా చూసేదానిని కాదు.. సినిమాల్లో చేయాలనే ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. అలాంటి నేను డిగ్రీ చదువుతూ ఉండగా సినిమా ఛాన్స్ వచ్చింది.

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అందరినీ నమ్మేసేదానిని. ఏ రిలేషన్ అయినా నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది. అవతలవారు కూడా సిన్సియర్ గా మనల్నే ప్రేమిస్తున్నారని అనుకుంటాం. నా ఫస్టు రిలేషన్ గురించి నేను ఎక్కడా ప్రస్తావించలేదు. జనాలు ఎవరికి తోచినట్టుగా వారు.. ఎవరికి నచ్చినట్టుగా వారు మాట్లాడుకున్నారు” అని అన్నారు.

పెద్దగా సినిమాలు చూడని నయన్ కు, మలయాళ ఇండస్ట్రీలో సినిమా ఛాన్స్‌ ఎలా వచ్చింది? ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో ఎలా అవకాశాలు వచ్చాయి? వంటి విషయాల గురించి వివరించారు. అటు పర్సనల్ లైఫ్, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ లో నిరాశ నిస్పృహల్లోకి వెళ్లిన తర్వాత నయనతార ఎలా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిందనే తెలియజేసారు.

- Advertisement -

సినిమా ఆఫర్స్ తగ్గిన సమయంలో స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఫోన్‌ చేసి ‘బాస్‌’ చిత్రంలో నటించమని అడగడం, బ్రేకప్ అయిన సమయంలో ‘శ్రీరామరాజ్యం’లో సీత పాత్రలో నటించే అవకాశం రావడం గురించి తెలియజేసారు. ‘శ్రీ రామరాజ్యం’ నా చివరి సినిమా అనుకున్నాను. ఆ తరువాత సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి నన్ను సినిమాలు మానేయమని చెప్పాడు.. ఇండస్ట్రీని వదిలేయమని అన్నాడు” అని చెప్పారు.

దీనికి నాగార్జున వీడియో బైట్ తో పాటుగా పలువురు సినీ ప్రముఖుల అభిప్రాయాలను కూడా పొందుపరిచారు. ‘గజినీ’ మూవీ టైంలో వచ్చిన విమర్శలు, బాడీ షేమింగ్‌, ‘బిల్లా’ సినిమా కోసం ధైర్యంగా బికినీ ధరించడం వంటి విషయాలు గురించి నయనతార మాట్లాడింది. ‘లేడీ సూపర్‌ స్టార్’ గా ఎదిగిన క్రమాన్ని వివరించింది.

అలానే నయనతార – విగ్నేష్ శివన్ ప్రేమ కథను ఈ డాక్యుమెంటరీలో ప్రముఖంగా వివరించారు. ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ సినిమా టైములో ఒకరిపై ఒకరికి ఎలాంటి అభిప్రాయాలు ఉండేవి? ఇద్దరి మధ్య ఎలాంటి డిస్కషన్ జరిగేది? ఇద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? ముందుగా ఎవరు ప్రపోజ్ చేసారు? వంటి విషయాల గురించి సెలబ్రిటీ కపుల్ మాట్లాడారు.

తమ రిలేషన్ షిప్ గురించి తెలిసిన తర్వాత వచ్చిన మీమ్స్ గురించి, ఆ సమయంలో జరిగిన ట్రోలింగ్ పైనా విగ్నేష్ స్పందించారు. ఏడడుగుల బంధంలో అడుగుపెట్టడం గురించి చెబుతూ.. నయనతార – విఘ్నేష్‌ శివన్ వివాహానికి సంబంధించిన వీడియోలను అందంగా చూపించారు.

పెళ్లి, దానికి సంబంధించిన సన్నాహాలు, గెస్ట్ లిస్ట్, మ్యారేజ్ టెన్షన్, వెడ్డింగ్ డ్రెస్ లు రూపొందించడానికి డిజైనర్లు పడిన శ్రమ.. ఇలా అన్ని అంశాలను ప్రస్తావించారు. పెళ్లికి ముందు వీరిద్దరూ ఎలా ఉన్నారు? పెళ్లి తర్వాత బంధం ఎలా ఉంది? అనే విషయాలను పంచుకున్నారు. ఇక చివర్లో వీరి పిల్లల ఉలగం, ఉయిరే లను చూపిస్తూ డాక్యుమెంటరీని ముగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement