సౌతిండియా స్టార్ నటీ నయనతార ఎట్టకేలకు నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారు నయనతార, తమిళ నటుడు విఘ్నేష్ శివన్. కాగా విఘ్నేశ్ శివన్ ఓ ఆసక్తికర ఫొటోను ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకున్నాడు. అందులో నయనతార చేతికి ఉంగరం ఉంది. దీంతో ఈ స్టార్ జంట ఎంగేజ్మెంట్ చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. అంతే కాదు వీరిద్దరు అతి త్వరలో పెళ్లి పీటలెక్కడం కూడా ఖాయం అని చెబుతున్నారు.
2015 లో వచ్చిన నానుమ్ రౌడీదాన్ సినిమా నుంచి వీరిద్దరు ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి వీరిద్దరు డేటింగ్లో ఉన్నారు. ఖాళీ సమయాలలో చెట్టాపట్టాలు వేయడం, పండుగుల, పార్టీలు కలిసి సెలబ్రేట్ చేసుకోవడం, ఇద్దరు కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటివి చేస్తూ వస్తున్నారు. ఇక పెళ్లెప్పుడు చేసుకుంటారా అని అందరు కళ్లప్పగించి చూస్తున్న సమయంలో ఇప్పుడు ఈ ఫొటో బయటకువచ్చింది.