Tuesday, November 19, 2024

వివాహ బంధంతో ఒక్కటైన ప్రేమ జంట.. ఘనంగా నయన్, విఘ్నేష్ పెళ్లి..

కోలీవుడ్‌లో మరో ప్రేమ జంట ఒక్కటైంది. ఏడేళ్ల నుంచి ప్రేమలో మునిగి తేలిన నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ వివాహం ఘనంగా జరిగింది. ఏడేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు.. ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని ఓ ప్రముఖ హోటల్‌లో జరిగిన వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. విఘ్నేశ్‌ శివన్‌ తమ పెళ్లి ఫొటోను సోషల్ మీడియలో షేర్ చేసుకున్నారు. ప్రేమగా నయన్‌ను విఘ్నేశ్ ముద్దాడగా.. నయన్ మురిసిపోయింది. అతి కొద్దిమంది అతిథులు, కుటుంబ సభ్యుల మధ్య విఘ్నేశ్-నయన్ ఒక్కటయ్యారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగింది. ఈ వేడుకకు తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా తాళి అందుకున్న విఘ్నేశ్.. తన ప్రేయసి నయన్ మెడలో మూడుముళ్లు వేశారు. కొత్త జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్తజంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement