సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న నయనతార తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్నారు. అయితే వీరి పెళ్లి కోసం అభిమానులతో పాటు సినిమా ప్రముఖులు కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఓ చానల్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న నయనతార విగ్నేష్ తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చింది. తమకు ఎంగేజ్మెంట్ అయిందని ఇదిగో రింగ్ అంటూ చూపించింది. ఇది షో కి సంబంధించిన ప్రోమో లో చూపించారు.
అయితే కొన్నాళ్ల క్రితం తన చేతికి ఉన్న రింగ్ తో విగ్నేష్ గుండెల మీద చెయ్యి పెట్టి ఓ ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేసింది నయన్. అప్పుడే ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ విషయమై కన్ఫామ్ చేసింది నయనతార. అయితే పెళ్లి ఎప్పుడు అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.