Sunday, September 8, 2024

Super star wife : న‌వ‌య‌వ్వ‌ని సూప‌ర్ స్టార్ స‌తీమ‌ణి

సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌తీమ‌ణి న‌మ్ర‌త‌శిరోద్క‌ర్ సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. నిత్యం ఫ్యామిలీ విష‌యాలు షేర్ చేస్తూ అభిమానుల్ని అల‌రిస్తుంటారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో . ఇన్ స్టా యాక్టివిటీని మ‌రింత స్పీడ‌ప్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. కుమార్తె సితార త‌ర‌హాలో న‌మ్ర‌త కూడా నేను సైతం అంటున్నారు.

సితార ఫోటోల‌తో పాటు న‌మ్ర‌త ఫోటో షూట్లు సైతం త‌రుచూ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. డిజైన‌ర్ దుస్తుల్లో న‌మ్ర‌త న‌వ నాయిక‌ల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా రేసులో నిలుస్తున్నారు. తాజాగా మ‌రో కొత్త ఫోటోతో నెటి జ‌నుల ముందుకొచ్చేసారు. ఇదిగో ఇక్క‌డిలా ఆల్ట్రామెడ్ర‌న్ దుస్తుల్లో ఆకర్షిస్తున్నారు. క్రీమ్ క‌ల‌ర్ డిజైన్ లో న‌మ్ర‌త ఓ ఈవెంట్ కి హాజ‌రైనప్పుడు ఇలా ముస్తాబై వెళ్లారు. న‌మ్ర‌త ఎంపిక చేసుకున్న యాక్స‌రసీస్ మ‌రింత బ్యూటీని జోడించాయి. కాళ్ల‌కు మ్యాచింగ్ న‌లుపు రంగు బూట్లు ధ‌రించి స్టైల్ కా బాప్ అనిపించేలా కొన్ని భంగిమ‌ల్లో కెమెరాకి ఫోజులిచ్చారు. ఓ లుక్ వేయండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement