Friday, November 22, 2024

ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన నాటు నాటు సాంగ్‌..

భారతీయ సినీ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. SS రాజమౌళి దర్శకత్వం వహించిన పాన్ ఇండియన్ బ్లాక్‌బస్టర్ RRR (రౌద్రం రణమ్ రుధిరం) ప్రతిష్టాత్మక ఆస్కార్‌లో నామినేషన్ సాధించి చరిత్ర సృష్టించింది. ఎన్టీఆర్-రామ్ చరణ్ నటించిన ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ సాధించింది. చంద్రబోస్ రాసిన ఈ పాటకు M.M. కీరవాణి సంగీతాన్ని అందించగా, రాహుల్ సిప్లిగంజ్, కాలా భైరవ పాడారు.

చరణ్, తారక్ తమ క్రేజీ స్టెప్పులతో యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు. RRR ఇప్పుడు 95వ అకాడమీ అవార్డ్స్‌లో నామినేషన్ సాధించిన మొదటి దక్షిణ భారత సిినిమాగా నిలిచింది. ఇప్పటి వరకు ఆస్కార్ నామినేషన్లు సాధించిన ఇతర భారతీయ చిత్రాలు మదర్ ఇండియా (1957), సలామ్ బాంబే (1988), లగాన్ (2001). భారతీయ చలనచిత్ర వైభవాన్ని తిరిగి తీసుకురావడంలో మొత్తం బృందం యొక్క అపారమైన కృషి చెప్ప‌లేనిది.

- Advertisement -

దీంతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ అద్భుతమైన విజయానికి RRR బృందానికి అభినందనలు తెలియజేస్తున్నారు. తెలుగు సినిమా ఇంత కాలం వస్తుందని ఎవరూ ఊహించలేదు, కానీ రాజమౌళి గ్లోబల్ బ్లాక్ బస్టర్ RRRతో అది సాధ్యమైంది.

యాక్షన్ డ్రామా అవార్డును గెలుచుకోగలిగితే, అలా చేసిన మొట్టమొదటి భారతీయ చిత్రం అవుతుంది. అయితే ఫలితం తెలియాలంటే మార్చి 13, 2023 వరకు ఆగాల్సిందే. గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రతి భారతీయ సినీ ప్రేమికుడు తల ఎత్తుకునేలా చేసినందుకు RRR బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాము.

Advertisement

తాజా వార్తలు

Advertisement